కట్టెలు కొట్టేవాడు సింహం నీతికథ | The man and Lion Friendship Grandma stories | RSK Telugu stories

కట్టెలు కొట్టేవాడు సింహం నీతికథ | The man and Lion Friendship Grandma stories | RSK Telugu stories #కట్టెలుకొట్టేవాడుసింహంనీతికథ #Telugukathalu #Grandmastories ************* కట్టెలు కొట్టేవాడు-సింహం నీతికథ **************** ఒక ఊరిలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారాన్ని ఒక మూటగా కట్టుకుని, తన జీవనాధారమైన…

కట్టెలు కొట్టేవాడు సింహం నీతికథ | The man and Lion Friendship Grandma stories | RSK Telugu stories

Source

0
(0)

కట్టెలు కొట్టేవాడు సింహం నీతికథ | The man and Lion Friendship Grandma stories | RSK Telugu stories
#కట్టెలుకొట్టేవాడుసింహంనీతికథ #Telugukathalu #Grandmastories

************* కట్టెలు కొట్టేవాడు-సింహం నీతికథ ****************
ఒక ఊరిలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారాన్ని ఒక మూటగా కట్టుకుని, తన జీవనాధారమైన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి రోజంతా కష్టపడి కట్టెలు కొట్టేవాడు… సాయింత్రం కాగానే వాటిని ఇంటికి తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు.

అలా ఎటువంటి కష్టం లేకుండా రోజులు గడుస్తున్న గోపయ్యకు.. అనుకోకుండా ఒకనాడు కట్టెలకోసం వెళుతుండగా సింహం ఎదురైంది. సింహాన్ని చూసి అతను గజగజా వణుకిపోయాడు. ఒళ్లంతా చెమటలు పట్టేసాయి.. ఈ అడవిలో కౄరమృగాలు వుండవని తెలిసి వచ్చాడు.. తీరా సింహం ఎదుటే ఇలా నిలబడవలసి వస్తుందని అస్సలు ఊహించలేదు.. ఇక ప్రాణాలపై ఆశలు వదులు కున్నాడు.. అతడి అవస్దను గమనించిన సింహం ఇలా అన్నది.
” భయపడుకు.. నిన్ను నేను ఏమీ చేయనులే..”
సింహం అలా అనే సరికి అతడు ఊపిరి పీల్చుకున్నాడు.. తర్వాత కొంత ధైర్యం తెచ్చుకొని కొద్దిగా ముందుకు వెళ్లి తను తెచ్చుకున్న ఆహారాన్ని సింహం ముందు పెట్టాడు.
దాన్ని మొత్తం తిన్న తరువాత ” ఆహారం చాలా రుచిగా వుంది..” అని మెచ్చుకుంది.

ఆనాటి నుండి గోపయ్య, సింహం మంచి స్నేహితులైపోయారు. అతడు ప్రతిరోజూ సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చి పెట్టేవాడు. పండుగలకూ, పబ్బాలకూ రకరకాల పిండి వంటలు కూడా తెచ్చి పెట్టేవాడు.
” ఆహా.. ఇంత రుచికరమైన పదార్ధాలను నేను నా జీవితంలో తినలేదు..:” అంటూ ఆ పిండి వంటలను లొట్టలు వేసుకుని మరీ తినేది సింహం.. స్నేహితుడు అలా మెచ్చుకునే సరికి గోపయ్య చాలా ఆనంద పడేవాడు.

కొన్నాళ్ళు జరిగిన తరువాత సింహానికి ఒక కాకి, నక్కతో స్నేహం ఏర్పడింది. అది వాటికి తన స్నేహితుడైన గోపయ్య గురించి గొప్పగా చెప్పింది.
” మృగరాజా.. నీ మిత్రుడిని మాకు చూపించవా..” అంది కాకి.
” మేమూ కూడా అతడితో స్నేహం చేయాలనుకుంటున్నాం..” అన్నది నక్క.
ఒకనాడు గోపయ్య వచ్చేవేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకొని అక్కడకు వచ్చింది. సింహం వెనుక కాకి, నక్క ఉండటం చూచి గోపయ్య అమాంతం ఒక్కసారిగా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతని వింత ప్రవర్తనకి సింహం ఆశ్చర్యపోయింది.
” మిత్రమా! వీళ్ళు నా కొత్త స్నేహితులు.. నీక్కూడా మిత్రులే.. భయపడవలసిన పనేమీ లేదు. చెట్టు దిగివచ్చి మా ముగ్గురికీ నీవు తెచ్చిన పదార్థాలు పెట్టి మమ్మల్ని సంతోషపెట్టు..” అని అన్నది.

అప్పుడు గోపయ్య సింహంతో ఇలా అన్నాడు..
” మిత్రమా! ఉన్నతులూ, ఉత్తములూ అయిన వారితోనే స్నేహముచేయాలి. నీవు ఈ అడవికి రాజువని నీతో స్నేహం చేశాను. కాని నీవు నీ కన్నా తక్కువ జాతివారైన నక్క, కాకితో స్నేహం చేశావు. దీనితో నీ గొప్పతనం పోయింది. పైగా ఈ నక్క జిత్తుల మారిది, కాకి అరిష్టానికి పేరు పొందినది. కాకి వాడియైన తన ముక్కుతో, నక్క కుటిలమైన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తాయి. ఇటువంటి దుష్టులతో నీవు స్నేహం చేశావు. కనుక ఇకనుండి నేను నీతో స్నేహం చేయను” అని చెప్పాడు. తమ గురించి అతడు అన్నీ నిజాలే చెప్పడంతో కాకి ఎగిరిపోయింది.. నక్క పారిపోయింది. దుష్టబుద్ది కలవారితో స్నేహం చేసి గోపయ్య లాంటి మంచి మిత్రుడిని దూరం చేసుకున్నందుకు సింహం సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. తర్వాత గోపయ్య కూడా చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే.. ” ఎల్లప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి. “

0 / 5. 0